Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి-2 తర్వాత ఎలాంటి మూవీ చేయబోతున్నాడో తెలుసా?

- Advertisement -

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 క్లైమాక్స్ షూట్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం కోసం మరే సినిమా చేయకుండా టైం మొత్తం బాహుబలికే కెటాయిస్తున్నాడు. అయితే ఈ ఏడాదే బాహుబలి-2 కూడా రిలీజ్ అవుతుంది అనుకున్నారు చాలా మంది. దీంతో వచ్చే యేడాది ప్రభాస్ మరో సినిమాతో వస్తాడు అనుకున్న ఫ్యాన్స్ కి జక్కన్న షాక్ ఇచ్చాడు.

బాహుబలి-2 వచ్చే యేడాది రిలీజ్ అవుతుందని చెప్పాడు కాబట్టి.. అప్పటి వరకూ ప్రభాస్ మరో సినిమా చేయాడు. ఇక ప్రభాస్ పెళ్లి కూడా వాయిదా పడ్డట్టే అనుకోవచ్చు. అయితే లేటెస్ట్ గా ఓ వార్త వినిపిస్తోన్న ప్రకారం ప్రభాస్ నెక్ట్స్ మూవీ రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. తనతో మిర్చి చిత్రాన్ని నిర్మించిన తన ఫ్రెండ్స్ బ్యానర్ యూవి క్రియేషన్స్ లోనే ఈ సినిమా ఉంటుందట.

అయితే సుజీత్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎలా ఉంటోందో తెలుసా? ఇది థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించనున్నాడట ఈ దర్శకుడు. బాహుబలి లాంటి భారీ సినిమా చేసిన తర్వాత ఎలాంటి కథాంశం ఎంచుకోవాలన్న కన్ఫ్యూజన్ ఏ ఆర్టిస్ట్ కైనా ఉంటుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో థ్రిల్లర్ మూవీస్ మంచి రిజల్ట్ ఇస్తుండటం వల్లే ప్రభాస్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ థ్రిల్లర్ జానర్ ప్రభాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లేంత వరకూ ఉంటుందా లేదా అనేది పక్కన బెడితే.. ప్రస్తుతం ప్రభాస్ థ్రిల్లర్ మూవీకి ఫిక్స్ అయ్యాడనేది కన్ఫార్మ్ అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -