Saturday, May 18, 2024
- Advertisement -

చైతూతో సమంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..?

- Advertisement -

కొన్ని రోజులుగా నాగచైతన్య, సమంత ల మధ్య ప్రేమ ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య వీరిద్దరూ కలిసి ఓ సినిమా చూసి బయటకు వస్తుంటె కెమెరా కి చిక్కారు అప్పుడి వరకు వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ రూమరు అనునుకున్న ఈ కెమెరా కి చిక్కిన ఫోటో చూసి అందరికి అర్ధం అయింది వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.

ఇటివలే వీరిద్దరూ కలిసి బాల్కనీలో ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో లో వీరిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారు వీరి ప్రేమ నిజమే అని అంటున్నారు. ఇక మరో ప్రక్క తన ప్రేమ విషయమై చాలా కాలంగా ఇంట్లో వారితో పోరాడుతున్న నాగచైతన్య ఆల్ మోస్ట్ అందరిని ఒప్పించాడని వినపడుతోంది.

అయితే ఈ విషయంలో నాగార్జున పెద్దగా ఇంట్రెస్ట్ గా లేడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కాని చైతన్య మాత్రం తన తల్లి ద్వారా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారంటూ తెలుస్తోంది. ఇక మరో సారి సమంత, చైతన్య కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిన్న నాయినా సినిమా ద్వారా పరిచయం అయిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. 

{youtube}v=ld13KiBObvs{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -