Thursday, May 16, 2024
- Advertisement -

ప్రభాస్… ప్రమోషన్ తో ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారుతున్నాడు!

- Advertisement -

ఒకటా .. రెండా.. వరసగా వివిధ సినిమాలను ప్రమోట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు ప్రభాస్. బాహుబలికి, బాహుబలి పార్ట్ టూకి మధ్య కొంచెం ఖాళీగా ఉన్న హీరో వరసగా వివిధ హీరోల సినిమాలను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఆడియో విడుదల వేడుకలకు హాజరవుతూ, టీజర్లను విడుదల చేస్తూ.. ప్రభాస్ ఆయా హీరోల సినిమాల ప్రమోషన్ లో భాగస్వామి అవుతున్నాడు.

ఆ హీరోలు తనకు సన్నిహితులైనా, ఆయా సినిమాల దర్శక, నిర్మాతలు తనకు సన్నిహితులు అయినా… ప్రభాస్ తన ఎంట్రీతో వారికి ఆశీస్సులు అందిస్తున్నాడు. ఈ మధ్యనే గరం, లోఫర్ వంటి సినిమాల కు సంబంధించిన ఫంక్షన్లలో ప్రభాస్ పాలు పంచుకున్నాడు. తాజాగా ఈ హీరో… సుధీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’ సినిమా ను కూడా ప్రమోట్ చేసే పనిని పెట్టుకున్నాడు.

ఈ సినిమా ఆడియోను తెగ ప్రశంసించాడు ప్రభాస్. మరి సుధీర్ బాబు సినిమాలను సహజంగా మహేశ్ బాబు ప్రశంసించాలి కానీ.. ఇలా ప్రభాస్ ఆ సినిమాలను ప్రమోట్ చేయడం ఏమిటి? అంటే.. ఆ సినిమా నిర్మాత ప్రభాస్ కు సన్నిహితుడని తెలుస్తోంది.

దీంతోనే ప్రభాస్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడని సమాచారం.మరి ఇలా వరసగా వేరే సినిమాలను ప్రమోట్ చేస్తే.. ఆయా హీరోలకు తన మద్దతునిస్తూ.. అండగా నిలుస్తూ.. ప్రభాస్ ఇండస్ట్రీ కి ఒక పెద్ద దిక్కుగా మారే యత్నంలో ఉన్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -