Tuesday, May 14, 2024
- Advertisement -

రాజమౌళితో ప్రభాస్ కొత్త సినిమా కథ ఇదేనా..?

- Advertisement -

చత్రపతి సినిమాతో ప్రభాస్ రెంజ్ ను దర్శకుడు రాజమౌళి అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బాహుబలి సినిమాతో ప్రభాస్ ను బాలీవుడ్ స్టార్స్ ను కుడా పక్కకు పెట్టాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు కష్టపడ్డాడు. ఈ ఐదేళ్లలో బాహుబలి మూవీతో మాత్రమే ప్రభాస్ నటించాడు. ఒక యువ హీరో ఇన్ని ఏళ్లు ఒక్క సినిమాకు కేటాయించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ కి పది సినిమాలు చేసినంత గుర్తింపు వచ్చింది.

అందుకే ప్రభాస్ మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. రాజమౌళి కూడా ప్రభాస్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తనపై నమ్మకంతో ఐదు ఏళ్లు డేట్లు కేటాయించినందుకు గాను కృతజ్ఞతతో ప్రభాస్ తో మరో సినిమాను చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. బాహుబలి సమయంలోనే ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. సాహో టైటిల్ తో యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. అది కాకుండా జిల్ దర్శకుడు రాధకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కూడా ప్రభాస్ ఓకే చెప్పాడు. 2018లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

2020 వరకు రాజమౌళి, ప్రభాస్ సినిమా కోసం ఆగాల్సిందే. బాహుబలి సినిమా తర్వాత ఇద్దరి కాంబో మూవీకి భారీ క్రేజ్ రావడం ఖాయం. ఆ స్థాయిలో జక్కన్న సినిమాను తెరకెక్కిస్తాడని ప్రేక్షకులు ఇప్పటి నుండే ఆశిస్తున్నారు. ఇక ఆ సినిమాకి ముండు మరో సినిమా రాజమౌళి చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివర్లో ప్రారంబించి 2018 చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక ప్రభాస్ తో రాజమౌళి ఈ సారి.. బాహుబలి లాంటి సినిమా కాకుండా.. స్టైలీష్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -