Wednesday, May 15, 2024
- Advertisement -

షూటింగ్ లో అసిస్టెంట్ కొట్టిన బాలయ్య.. ఎందుకు..?

- Advertisement -

టాలీవుడ్ లో బాలయ్య బాబు ఏం చేసిన అది స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో సినిమా షూటింగ్ ప్రారంభించిన తొలి షాట్ ను దేవుడి పటాల మీద చిత్రీకరించి తరువాత ఏదైన సాధారణ సీన్ ను చిత్రీకరిస్తారు. కానీ బాలయ్య బాబు మాత్రం బిన్నంగా క్లాప్‌ నిచ్చిన వెంటనే ఫైట్‌ చేసేశాడు.

కేఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న నందమూరి బాలకృష్ణ 102వ చిత్రానికి ప్రారంభ సన్నివేశానికి పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను క్లాప్‌ నివ్వగా, కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించారు. ఇక క్లాప్‌నిచ్చిన వెంటనే ఒక్క ఉదుటన తన ముందున్న వ్యక్తిని తన్నగానే గాల్లోకి ఎగిరిపోతాడు. ఈ సన్నీవేశం ఏంత పవర్ ఫుల్ గా ఉందో.. సినిమా కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని మూవీ యూనిట్ అంటోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో బాలయ్య మళ్లీ తప్పు చేశారు. ఇంతకముందు చాలా సార్లు ఇలా పొగరుగానే ప్రవర్తించారు.

అభిమానుల దగ్గరే ఇలా చేస్తు ఉండటం ఎవరికి నచ్చడం లేదు. హీరోగా, రాజకీయనాయకుడిగా ఉన్న బాలయ్య.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్ధం కావడం లేదు. తాజా ఇప్పుడు 102వ ప్రారంభోత్సవ సందర్బంగా ఓ సంఘటన జరిగింది. షాట్ కోసం రెడీ అవుతున్న బాలయ్య అసిస్టెంట్ ను తల మీద కొట్టి షూ విప్పాల్సిందిగా ఆదేశించాడు. మాములుగా చెప్పి చేయించుకోవాల్సింది పోయి.. బాలయ్య కొట్టి మరి చేయించుకుంటున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

https://www.youtube.com/watch?v=VgIu5fGy7hE

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -