Monday, April 29, 2024
- Advertisement -

ప్రభాస్ సాలార్‌ సినిమా స్టోరీ లైన్ ఇదేనా..?

- Advertisement -

భారతీయ సినిమా అత్యంత ఎదురుచూస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా బిగ్ ఫిలిం సాలార్. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇది సీక్వెల్, KGF సిరీస్‌తో లింక్ ఉందంట్టు ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ రూమర్‌లకు తోడు సాలార్‌ కథాంశం, సినిమాలో ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మొదటి కన్నడ సినిమా ఉగ్రమ్ కథాంశం ఆధారంగా సాలార్ స్క్రిప్ట్‌ను వ్రాసాడు తర్వాత ప్రభాస్ ఇమేజ్‌కి తగినట్లుగా సవరించాడు. ఈ సినిమా వ్యవస్థీకృత క్రైమ్ గ్యాంగ్స్, మాఫియా నేపథ్యంలో సాగుతుంది. మరణిస్తున్న తన స్నేహితుడికి ఇచ్చిన మాటకోసం ఇతర క్రిమినల్ గ్యాంగ్‌లపై దాడులకు ప్లాన్ చేసే గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. మాఫియా ప్రపంచంలో జరిగే ప్రతీకార కథ ఇది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఇంటెన్స్ గా ఉంటుందని తెలుస్తుంది.

Also Read : కష్టాల్లో పూజా హెగ్డే…

ఇక ఈసినిమాను మొదట సెప్టెంబర్ 28, 2023న విడుదల చేసెందుకు ఫ్లాన్ చేసారు. కాని విడుదల తేదీని 2024 సంక్రాంతికి వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలిసింది. KGF సిరీస్‌తో దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న ఈ సినిమా పై అటు ట్రేడ్‌ వర్గాలతో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ మంచి టాక్‌ నడుస్తోంది. మరో వైపు ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ను తెరపై ఎలా చూపించాడో చూడాలని ఎదురుచూస్తున్నారు.

సాలార్‌లో ప్రధాన పాత్రలో ప్రభాస్ తో పాటు వర్ధరాజ మన్నార్ క్యారెక్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శృతి హాసన్, మీనాక్షి చౌదరి మరియు శ్రీయా రెడ్డి ఇతర ప్రముఖ పాత్రల్లో నటింస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -