Wednesday, May 7, 2025
- Advertisement -

ఆలీకి పగిలిపోయినట్లే…!

- Advertisement -

ఆలీతో ఓ ఛానల్ ఆలీవుడ్ అంటూ లైవ్  ప్రోగ్రామ్ ఇచ్చింది.ఆ  ఛానల్లో యాంకర్ … ఆలీతో మీకు  ఎవరో వార్నింగ్ ఇచ్చారు కదా అని ఓ డేరింగ్ కొశ్చన్ అడిగింది..దానికి ఆలీ సమాధానంగా….

నాకు వార్నింగ్ ఇచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదన్నాడు. ఆలీ చెప్పింది అతని గురించి అతను ఎక్కువగా ఫీలౌతోన్న విషయం. ఓకే ఒకవేల అతని కాన్ఫిడెంట్ నిజమనుకుందాం. ఇక్కడ అతనికి అర్ధం కానిది ఎవరో వచ్చి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఇవ్వాల్సిన వారు అతని చేష్టలు,కామెంట్లు చూసి అతనికి ఛాన్స్ లు రాకుండా చేస్తే చాలదా. ఆలి మ్యాటర్లో ఇపుడిదే జరుగుతుంది.

పిచ్చి పీక్ స్టేజ్ కెళితే ఎలా ఉంటుందో….ఆలీ యాంకరింగ్ చేస్తూ…..చేసే ఆడియో లాంచ్ లు ,అవార్డ్ ఫంక్షన్లు చూస్తే మనకు ఇట్టే అర్ధమవుతుంది.సన్నాఫ్ సత్యమూర్తి టైమ్లో సుమతో ఎక్కడ నొక్కాలని అడగడం, సమంతా నడుము  చూపించి విజయవాడ బెంజ్ సర్కిల్ లా ఉందని చెప్పడం, యాంకర్ శ్యామల, రకుల్ ప్రీత్ సింగ్ తో కారం ఎక్కడ పెడతావని అడగం ఇవన్నీ మనం చూసాం. విసిగి వేజారం.

దీనికి రిజల్ట్ శివం ఆడియో లాంచ్ తో దొరికేసింది.ఈ ఆడియో లాంచ్ లో ఆలీ పక్కన నేను చేయనని చెప్పి సుమ కరాఖండీగా నిర్మాతలతో చెప్పేసిందట.అందుకే ఆలీని పక్కన పెట్టేశారు.దీంతో ఆలీకి పగిలిపోయినంత పనైంది.ఏ కాదంటారా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -