Saturday, April 27, 2024
- Advertisement -

సుమ…అరుదైన వ్యాధితో బాధపడుతున్నారా!

- Advertisement -

స్టార్ మహిళా..ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది యాంకర్ సుమనే. తన మాటలతో, అదిరే పంచ్‌లతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది సుమ. యాంకరింగ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారు సుమ. అందుకే సుమ చేసే ఏ కార్యక్రమానికైనా అంతటి గుర్తింపు ఉంటుంది. తెలుగింటి మహిళల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సుమపై రూమర్స్ కొత్తేమీ కాదు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను కీలాయిడ్ టెండెన్స్ అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. దీని వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఓ దశలో యాంకరింగ్ చేయవద్దనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సుమకు వచ్చిన వ్యాధిపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. దీంతో రూమర్స్‌కి చెక్ పెట్టేలా వెంటనే స్పందించారు సుమ.

సోషల్ మీడియా వేదికగా తరచూ ట్రోల్స్ ఎదురవుతూనే ఉంటాయి. మొదట్లో వాటి వల్ల నేను కూడా ఎంతో ఇబ్బందిపడ్డా., కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.తనే పై విమర్శలు చేసే వారందరికీ నా వర్క్ తోనే సమాధానం ఇస్తానని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -