Saturday, May 4, 2024
- Advertisement -

పుష్ప 2 వర్సెస్ సింగం 3 వర్సెస్ ఇండియన్ 2…తగ్గెదేలే!

- Advertisement -

సాధారణంగా బాక్సాఫీస్ వార్ అంటే సంక్రాంతి సినిమాలే గుర్తుకొస్తాయి. ఎందుకంటే సంక్రాంతికే అగ్రహీరోలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీ పడతారు. ఇలా బాక్సాఫీస్ వద్ద వార్‌లో ఎవరు గెలిచినా సినిమాలు బాగుంటే అభిమానులకు పండగే. అయితే తాజాగా ఈసారి బాక్సాఫీస్ వార్ ఇండిపెండెన్స్‌ డేకి జరగనుంది.

2024 ఆగస్టు 15న మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఇప్పటికే అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫామ్ కూడా అయింది. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రూపొందుతున్న సింగం రిటర్న్ ( సింగం 3 ) మూవీ 2024 ఆగష్టు 15 ననే రిలీజ్ కానున్నట్లు టాక్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం, సింగం 2 మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో సూర్య రీమేక్ చేయగా బాక్సాఫీస్ షేక్ అయింది. సూర్య నటనకు మంచిమార్కులు పడగా బుల్లితెరపై ఎప్పుడు వచ్చినా అదిరే రేటింగ్సే.

శంకర్ దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 మూవీ కూడా ఆగష్టు 15ననే విడుదల చేసేందుకు మేకర్ రెడీ అవుతున్నారటి టాక్. ఇక ఈ మూడు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇదే జరిగితే ప్రధానంగా టాలీవుడ్, కోలీవుడ్‌లో బాక్సాఫీస్ వార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. మరి ఈ త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారు…?బాక్సాఫీస్‌ను ఎవరు కొల్లగొడతారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -