Friday, May 3, 2024
- Advertisement -

కొత్త సినిమా తీసే ప్లాన్ లో ఆర్.పి!

- Advertisement -

సంగీత ద‌ర్శ‌కుడుగా.. న‌టుడుగా.. ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కుడిగా… త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. సంగీత సరిగమలలో ఆయనది దశాబ్ద కాలం పాటు వెనుతిరిగి చూసే అవసరం లేనంత సక్సెస్‌ఫుల్ కెరీర్. సగటు ప్రేక్షకుడు సైతం సాదా సీదాగా పాడేటట్టుగా రాగాలను స్వర పరిచి, చేసిన ప్రతీ సినిమా హిట్ అనే స్థాయికి వెళ్ళిన సంగీత దర్శకుడు, ఆర్.పి పట్నాయక్. ఆ తరువాతి కాలంలో ఎదురైన కొన్ని అపజయాలు తను ఏకంగా సంగీతాన్ని విడిచి నటుడిగా ప్రయత్నించటానికి కారణమయ్యాయి.

నటనకు స్వస్తి చెప్పకుండానే, సినిమా దర్శకత్వం పై మొగ్గు చూపి, ‘బ్రోకర్’ అనే సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించారు ఆర్.పి పట్నాయక్. అయితే ఆ సినిమా ఆర్.పి కి కమర్షియల్ సక్సెస్ ని ఇవ్వలేకపోయింది. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆర్.పి కొన్ని చిన్న సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆర్.పి ఇప్పుడు ఓ కొత్త సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడు.

అందరిలా కాకుండా డిఫరెంట్‍గా సినిమాలు తీయాడానికి ఆర్.పి ఇష్టపడుతుంటాడు. అలాగే ఇప్పుడు కూడా ఓ సరి కొత్త కథతో ఓ సినిమా తీయనున్నాడట. మీడియాలో జరిగే అన్యాయాలు, అందులో ఉండే లోసుగులు, మీడియా వల్ల ప్రజలకు ఎంత వరకు ఉపయోగం అలాగే మీడియా వల్ల ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనే కొత్త పాయింట్ పై ఆర్.పి ఓ సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకి సంబంధి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -