Friday, March 29, 2024
- Advertisement -

కావలనే శృంగారపు సీన్స్ పెడుతున్నారు : రాధికా ఆఫ్టె

- Advertisement -

తెలుగులో వచ్చిన ‘రక్త చరిత్ర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అందాల బ్యూటీ రాధికా ఆఫ్టె. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ తర్వాత ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. ఈ సినిమాలో పద్దతిగల అమ్మాయిగా నటించింది రాధికా. తర్వాత చాలా కాలానికి బాలయ్య బాబు ’లెజెండ్’ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత మరోసారి బాలయ్యతో ‘లయన్’ సినిమాలో నటించింది. అయితే ఈ చిత్రం తర్వాత.. ఈమె పెద్దగా సౌత్ సినిమా సినిమాల్లో నటించలేదు. అంతేకాకుండా సౌత్ లో తనతో ఓ హీరో అసభ్యకరంగా ప్రవర్తించాడని కామెంట్స్ చేసి టాలీవుడ్ కు పూర్తిగా దూరం అయ్యింది రాధికా. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రాధికా.. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల తాను ఇటీవల చేసిన హాట్ ఫోటో షూట్ లు అన్నీ ఒకేసారి వడ్డించింది. ఈ ఫోటోలు కుర్రకారుని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక పనిలో పనిగా.. అభిమానులతో ఓ సారి ముఛ్చటించింది కూడా.

‘ఎందుకు ఈ మధ్య ఎక్కువగా సినిమాలు చెయ్యడం లేదు అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘ఎక్కువగా శృంగారానికి ప్రాధాన్యత ఉన్న సీన్ల గురించే దర్శక నిర్మాతలు.. నన్ను సంప్రదిస్తున్నారు. బట్టలు లేకుండా నటించడానికి నేను ఏమాత్రం ఆలోచించను. కథలో భాగంగా అలాంటి సీన్లు ఉంటే చేస్తా.. కానీ కావాలని శృంగారపు సన్నివేశాలు ఇరికిస్తే నేను చెయ్యను” అంటూ రాధికా చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -