Thursday, April 25, 2024
- Advertisement -

మాజీ సీఎం భార్య మళ్లీ సినిమాల్లోకి.. రొమాంటిక్ సీన్స్ కూడా..!

- Advertisement -

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ భార్య అయిన రాధిక హీరోయిన్ గా గతంలో చేసిన విషయం తెలిసిందే. సినీ నిర్మాణంలో ఉన్న కుమారస్వామికి రాధికతో పరిచయం ఏర్పడింది. దాంతో అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. ఇప్పుడు వీరికి ఒక పాప కూడా ఉంది. కుమారస్వామితో పెళ్లి తర్వాత సినిమాలను ఆపేసింది రాధిక. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

కుమార స్వామి సీఎంగా ఉన్న సమయంలోనే ఈమె రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది. రాధిక నటించిన రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సమయంలోనే రాధిక మరింత స్పీడ్ పెంచాలని భావిస్తుందట. కన్నడ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈమె యంగ్ హీరోలకు జోడీగా నటించేందుకు కూడా ఆసక్తిగా ఉందట. గతంలో మాదిరిగా రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు కూడా ఓకే అంటోందని చెబుతున్నారు.

హీరోయిన్ గానే కాకుండా సినిమాల్లో కీలక పాత్రలు చేసేందుకు కూడా ఈమె ఓకే చెబుతోందట. ఇమె 2002 సంవత్సరంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే రొమాంటిక్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అనేది చూడాలి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కాస్త గౌరవప్రధమైన పాత్రలు చేస్తూ బాగుంటుందని కొందరు అంటున్నారు. హీరోయిన్ గానే కొనసాగాలని అనుకుంటే ఎక్కువ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -