ప్రేమ కావాలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు హీరో సాయి కుమార్ కొడుకు ఆది, ఇషా చావ్లా. వీరి ఇది మొదటి సినిమా. దీంతో ఈ చిత్రం తర్వాత ఇద్దరూ బాగానే వరుస ఛాన్సులు దక్కించుకున్నారు. అయితే హీరోయిన్ ఇషా చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో సినీ పరిశ్రమలో ఎక్కువ రోజులు రాణించలేకపోయింది.
అయినప్పటికీ సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇషా చావ్లా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని అందువల్లనే సినీ పరిశ్రమకు దూరం అయిందంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ మధ్యకాలంలో ఇషా చావ్లా ఇద్దరు పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి.
దాంతో ఫ్యాన్స్ కూడా ఆమెకి పెళ్లైంది అని అనుకుంటున్నారు. పెళ్లిపై వస్తున్న వార్తలపై ఇషా స్పందించడం లేదు. ఈ వార్తలు ఎక్కువ కావడంతో త్వరగా ఈ విషయంపై స్పందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే తెలుగు, కన్నడలో దాదాపుగా 7 పైగా చిత్రాల్లో ఇషా నటించింది. ఇందులో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్ తో రెండు చిత్రాల్లో నటించగా, బాలయ్య బాబు సరసన శ్రీమన్నారాయణ అనే చిత్రంలో నటించింది.
