- Advertisement -

‘పెద్ది’తో రెహమాన్‌..మ్యాజిక్ పనిచేసింది!

- Advertisement -

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇప్పటివరకు ఆయన ఎక్కువగా తమిళ్, హిందీ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగులో మాత్రం చాలా కొద్దిపాటి సినిమాలకు మాత్రమే సంగీతం అందించారు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆయన డైరెక్ట్ తెలుగు ప్రాజెక్ట్‌గా చేస్తున్న చిత్రం ‘పెద్ది’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే విడుదలైన ‘చికిరి’ పాట సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్ సృష్టించింది. టీజర్‌కు రెహమాన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో రెహమాన్‌పై మళ్లీ క్రేజ్ పెరిగిందని చెప్పాలి. ‘రెహమాన్ అంటే తమిళ్, హిందీ సినిమాలే’ అన్న టాక్‌ను ‘పెద్ది’ చెరిపేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

‘పెద్ది’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు కూడా రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ – విక్రమ్ కె కుమార్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కూ ఆయనను సంప్రదించినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు, రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రానికి కూడా రెహమాన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

ఒకే సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ సొంతం చేసుకున్న రెహమాన్, ఇక వరుసగా తెలుగు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -