Monday, May 6, 2024
- Advertisement -

బాహుబలిలో రానాకి జోడిగా శ్రియ

- Advertisement -

ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2ని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి మొదటి పార్ట్ అద్భుతమైన హిట్ అవ్వడంతో బాహుబలి 2పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. సో జక్కన్న కూడా మొదటి భాగం కన్న రెండో భాగం మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట. ఐతే రాజమౌళి సినిమా చిన్న పాత్ర వచ్చిన చేయడానికి చాలా మంది నటి నటులు ఎదురు చూస్తుంటారు.

అలాంటి అవకాశమే వచ్చింది శ్రియకి. ఈ సినిమాలో రానా పోషిస్తున్న భల్లాలదేవ పాత్రకి భార్యగా శ్రియ కనిపించబోతోందని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ లో రానా కొడుకుని చూపించాడు కానీ… భార్యని మాత్రం చూపించలేదు. అయితే రెండో పార్ట్ లో మాత్రం ఆ పాత్ర కనిపించాల్సి వుందట. సో ఆ పాత్రకి శ్రియ అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట.

శ్రియ ఇదివరకు రాజమౌళి  దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతిలో నటించిన విషయం తెలిసిందే. ఐతే ఇటివలే రానా – శ్రియల మధ్య ఫొటో షూట్ చేశారట. సో త్వరలోనే శ్రియ కూడా  బాహుబలి టీమ్ తో జాయిన్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -