- Advertisement -

బాలీవుడ్ లో స‌ర్ధార్ రికార్డు సృష్టించబోతున్నాడు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే పవన్ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం వెనకల ఉన్న అసలు కారణం ఇదేనట.

ఏప్రిల్ 8వ తేదీన తెలుగు, హిందీలో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని బాలీవుడ్‍లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తాజాగా సర్దార్ సినిమాకి సంబంధించి బాలీవుడ్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఐతే ఈ సినిమాని బాలీవుడ్‍లో ఎనిమిది వందల పైగా థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఐతే పవన్ తన సర్దార్ సినిమాతో బాలీవుడ్‍లో కూడా రికార్డులు సృష్టించనున్నాడు. పవన్ ఆల్రెడీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ తెలుగు సినిమాలు హిందిలోకి అనువాదం అవుతుంటాయి. సో సర్దార్ సినిమాకి కూడా మంచి స్పందన వస్తుందని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్‍లో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ స్టార్ట్‌ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తుంది. బాబీ దర్శకత్వం వస్తున్న ఈ సినిమా ఆడియోని మార్చి 20న విడుదల చేయనున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -