Wednesday, May 8, 2024
- Advertisement -

రాజమౌళి రాబోయే సినిమా హీరో ఇతనే

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి తన బాహుబలి సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికి.. తన తదుపరి సినిమా ఏమిటనేది మాత్రం బయటకు చెప్పకపోవడంతో.. అల్లు అర్జున్ తో కానీ ఎన్టీయార్ తో కానీ రాజమౌళి సినిమా చేస్తాడని సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.

అయితే ఆ కథనాలన్నిట్నీ కాదంటూ సింపుల్ గా నెక్స్ట్ మంత్ తన కొత్త సినిమాను ఎనౌన్స్ చేయనున్నాడు రాజమౌళి. మరి రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో అనుకుంటున్నారా.. అక్కినేని అందగాడు అఖిల్ తో. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హెల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో నటించనున్నాడని, అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చోందని సమాచారం.

ఇప్పటికే సినిమాకి చాలా గ్యాప్ రావడంతో పాటు.. తాను తెరకెక్కించాలనుకుంటున్న.. “మహాభారతం” స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యేసరికి ఎలాగూ ఆరేడు నెలలు పట్టే అవకాశం ఉంది. అందుకే ఈ లోపు అఖిల్ తో ఓ సినిమా కంప్లీట్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని వినికిడి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -