Friday, May 3, 2024
- Advertisement -

రాజ‌కీయాల‌లో చర్చనీయాంశంగా మారిన టాపిక్….

- Advertisement -

గత సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల ప్రచారంలో టీడీపీ -భాజాపా కూట‌మికి మ‌ద్ద‌తు తెలుపుతూ ప్ర‌చారం చేసిన సినీన‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌డంతో కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. ఆస‌మ‌యంలో మోదీపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించిన విష‌యం తెలిసిందే. ఏపీలో పెట్టిన స‌భ‌లో మోదీ కూడా ప‌వ‌న్‌ను ప్ర‌శంసించారు. అయితే ఇప్పుడు తాజాగా సీన్ రివ‌ర్స్ అయ్యింది.

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి మారిపోతుంటాయి. త‌మ‌కు లాభం ఉంద‌నుకున్న‌పుడు రాజ‌కీయాలు చేయాడం అవ‌స‌రం తీర‌గానె వారిని ప‌క్కు నెట్టేయ‌డం రాజ‌కీయాల్లో మామూలె. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి అంతె. ఇప్పుడు తాజాగా ప‌వ‌న్‌కు మోదీ పెద్ద షాక్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.

‘స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలంటూ పవన్‌కాల్యాణ్‌ మినహా తెలుగు సినిమాలోని పలువురు ప్రముఖులకు ప్రధాని లేఖలు రాశారు. తెలుగు సినీ ప్ర‌ముఖులు రాజ‌మౌళి, మోహ‌న్ బాబు, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబుకు మోదీ లేఖలు రాశారు. మోహ‌న్ లాల్‌, అనిల్ క‌పూర్‌, అనుష్క‌శ‌ర్మ‌ల‌కు కూడా మోదీ లేఖ‌లు రాశారు. అయితే, త‌న‌కు గ‌తంలో మ‌ద్ద‌తు తెలిపిన‌, టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల్లో ఒక‌రైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆయ‌న లేఖ రాయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోదీ ఇక పవన్ ను పక్కకు పెట్టేశారేమో అని విశ్లేషకుల అభిప్రాయం.

అయితే దీనివెనుక భారీ కార‌నాల‌తోపాటు వ్యూహం ఉన్నాయ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. 2014లో మ‌ద్ద‌తు తెలిపిన ప‌వ‌న్ ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంపై పవన్‌కళ్యాణ్ బిజెపిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతలను దుమ్మెత్తిపోశారు.కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని ఆయన ఏపీ ప్రజలను కోరారు. 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీచేసేందుకు జనసేన పార్టీ సన్నాహలు చేస్తోంది. 2017 అక్టోబర్‌ నుండి పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు పూర్తి సమయాన్ని కేటాయిస్తాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికె ప్ర‌క‌టించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిందని పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలోని పలు చోట్ల విద్యార్థులతో ప్రత్యేక హోదా కోసం సభలు నిర్వహించారు. టిడిపి ఎంపీలపై కూడ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ కేంద్రం వివక్ష చూపుతోందంటూ పవన్‌ విమర్శలు గుప్పించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మోడీ పవన్‌కళ్యాణ్‌కు లేఖ రాయలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతోంది.

నాడు ఆలింగనం చేసుకోన్నారు, నేడ ‘స్వచ్ఛతేసేవ’ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సెలబ్రిటీలకు ప్రధానమంత్రి మోడీ లేఖలు రాశారు. కానీ, తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులందరికీ లేఖలు రాశారు.కానీ, గత ఎన్నికల్లో తమతో కలిసి పనిచేసిన పవన్ కళ్యాణ్‌కు మాత్రం లేఖ రాయకపోవడం మాత్రం తీవ్ర చర్చకు కారణమైంది. జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు బిజెపి నేతల మధ్య ఆగాధం ఏర్పడిందని ఈ ఘటనతో అర్ధమౌతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -