- Advertisement -

ఊపిరి విషయంలో నా అభిప్రాయం తప్పు!

- Advertisement -

నాగర్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‍లో వచ్చిన చిత్రం ఊపిరి. కొన్ని గంటల ముందే విడుదలైన ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మరో మంచి సినిమా అని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో నాగర్జున, కార్తీ తమ నటనలతో సినిమాని ఓ రెంజ్‍కి తీసుకెళ్లారు.

ఇక ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లిని మెచ్చుకోవాలి. ప్రపంచంలోని అత్యుత్త్యమమైన చిత్రాల్లో ఒకటైన `ఇన్ టచబుల్స్`ని వంశీ ఇండియనైజ్ చేసిన విధానం అదుర్స్ అని అభినందిస్తున్నారంతా. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ విషయం లో దర్శకుడు వంశీని తెగ మెచ్చుకున్నాడు. “నిజం చెబుతున్నా `ది ఇన్ టచబుల్స్`ని వంశీ హ్యాండిల్ చేయలేడనుకొన్నా. కానీ తను తీసిన విధానం చూసి నా అభిప్రాయం తప్పని తెలిసింది.

నా అభిప్రాయాన్ని వమ్ము చేసినందుకు వంశీకి కృతజ్ఞతలు“ అని అభినందించాడు రాజమౌళి. ఇలానే పలు ప్రముఖుల నుండి ఊపిరి సినిమాకి ప్రశంసలు అందుతున్నాయి. మేం వంశీ కోసం సినిమాకి వెళ్లలేదు. కేవలం కార్తీ – నాగార్జునలాంటివాళ్లు ఉన్నారనే సినిమాకి వెళ్లాం. కానీ వంశీకోసం కూడా ఇకపై సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం“ అన్న వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో  దర్శనమిచ్చాయి. మొత్తం మీద వంశీ ఈ సినిమాతో టాప్ రెంజ్‍కి వేళ్ళిపోయినట్టే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -