Monday, May 20, 2024
- Advertisement -

రోజాకు కోపం వచ్చింది..

- Advertisement -

నిజం. రోజాకు కోపం వచ్చింది. ప్రతి రోజు వచ్చే కోపమే కదా.. కొత్తగా మళ్లీ ఇదేమిటి అనుకుంటున్నారా. నిజంగానే నిజం. రోజాకు వెయ్యి తొమ్మిదొందల అరవై ఐదో సారో… లక్షా డభై వేల పదో సారో కోపం వచ్చింది. ఈ సారి కూడా ఎప్పట్లాగు చంద్రబాబుపై విరుచుకుపడింది రోజక్క. తన మీద కక్ష సాధిస్తున్నారని, అందుకోసం మహిళలను వాడుకుంటున్నారని మండిపడింది.

కాల్ మనీ రాకెట్టు, సెక్స్ కుంభకోణాల బాధితులను న్యాయం జరిగేందుకు తాను శాసనసభలో మాట్లాడాలనుకుంటే చంద్రబాబు ఏకంగా రాజకీయంగా తనను సర్వనాశనం చేయాలనుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు రోజా.

కామ సిఎం అన్నాను కాబట్టి ఏడాది పాటు సస్పెండ్ చేశామని చెబుతున్నారని, మరి ఆ మాట రాసిన ఈనాడు వాళ్లకి ఎందుకు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వలేదని కోపంలో కూడా అమాయకంగా ప్రశ్నించారు రోజా. తోటి శాసనసభ్యురాలు అనితపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని, ఆమెను పావులా వాడుకుంటున్నారనే తన బాధ అని కూడా రోజా ఆగ్రహించారు. మొత్తానికి రోజా మరోసారి విలేకరుల సమావేశంలో పాత పాటని చక్కగా పాడారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -