Sunday, May 4, 2025
- Advertisement -

అనుష్క వల్ల రాజ‌మౌళి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా..?

- Advertisement -
Rajamouli Schoked Ansuhka

బాహుబలి 2 సినిమాలో అనుష్క చాలా స్లిమ్ గా కనపడి.. అందరికి షాక్ ఇచ్చింది. ప్రమోషన్లో కనిపించినప్పుడు భారీగా కనిపించిన.. సినిమాలో మాత్రం చాలా నాజూకగా, చాలా చిన్నపిల్లలా కనిపించింది. అయితే ఇదంతా గ్రాఫిక్స్ మాయ. అయితే ఇక్కడ చెప్పుకోతగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనుష్కను స్లిమ్ గా మార్చి మెరుగులు దిద్దడానికి దర్శకుడు రాజమౌళి రూ.2 కోట్లు ఖర్చు చేశారట. షారూఖ్ ఖాన్ కు చెందిన రెడ్ ఛిల్లీస్ సంస్ద అనుష్క కు చెందిన మొత్తం ఫుటేజ్ ని తీసుకుని ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కిందని తెలుస్తోంది.

ఈ టెక్నాలిజీనే షారూఖ్ ఖాన్..ఫ్యాన్ చిత్రం కోసం వాడారు. ఇప్పుడు అదే టెక్నాలిజిని అనుష్క కోసం వాడి సక్సెస్ అయ్యారు. ఇవాళ అందరూ అనుష్క స్మార్ట్ లుక్ ని చూసి ఆశ్చర్యపోతూ ఆనందిస్తున్నారు. ఇంతకీ అనుష్క అందగత్తే కదా, ఆమెకు మెరుగులు అవసరమా..? అన్న సందేహం కలగవచ్చు. అయితే ఈ ముద్దుగుమ్మ సైజ్ జీరో చిత్రం కోసం 80 కిలోలకు పైగా బరువు పెరిగింది. ఆ తర్వాత బాహుబలి–2లో నటించింది. దీంతో యుద్ధ ప్రాతిపదికపై బరువు తగ్గాల్సిన పరిస్థితి. అందుకు దర్శకుడు రాజమౌళి అనుష్కకు ఒక గడువు విధించారట. అయితే గడువైతే పూర్తి అయ్యిందిగానీ అనుష్క బరువు మాత్రం తగ్గించలేకపోయారు. దీంతో రాజ‌మౌళికి కోపం వ‌చ్చింద‌ట‌. ఇక త‌ప్ప‌క జ‌క్క‌న్న స్వీటీ కోసం వేచి ఉండలేక బరువైన అనుష్కతోనే షూటింగ్‌ చేశారు.

అయితే బాహుబలి సినిమా సమయంలో దాని సీక్వెల్‌కు సంబంధించిన 40 శాతం వరకూ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అందులో అనుష్కకు అ తర్వాత అనుష్కకు చాలా తేడా కనిపించడంతో వేరే దారి లేక ఆమెకు సంబంధించిన సన్నివేశాలను రీషూట్‌ చేయడంతో పాటు అనుష్క రూపాన్ని డిజిటల్‌ టెక్నాలజీతో స్లిమ్‌గా తీర్చిదిద్దారట. ఇలా చేసినందుకు గాను 2 కోట్లు ఖర్చు అయ్యిందట. చిత్రంలో అనుష్కది ప్రధాన పాత్ర కావడంతో నిర్మాతలు ఆ ఖర్చు భరించడానికి కూడా వెనకడుగు వేయలేదని సమాచారం.

Related

  1. ప్రభాస్ అంటే అనుష్క కు చాలా ఇష్టమట
  2. ప్ర‌భాస్,అనుష్క‌ల మధ్య లవ్ ఎఫైర్.. బ‌య‌ట‌ప‌డిన నిజాలు
  3. ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?
  4. అనుష్క చేసిన ప్రయోగం తిప్పికొట్టింది.. అందుకే అలా అయ్యింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -