Tuesday, May 21, 2024
- Advertisement -

రాజమౌళితో ఎన్టీఆర్ సినిమా కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?

- Advertisement -

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‍లో ఓ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి-2′ షూటుంగ్‍లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే ఎన్టీఆర్‍తో సినిమా తీయనున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్‍లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రాజమౌళి భారీ ప్రాజెక్టులనే ఎంచుకుంటున్నాడు. బాహుబలి సినిమా కాంప్లీట్ అయ్యాక గరుడ అనే భారీ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారట. ఈ సినిమాని ఎన్టీఆర్‍తో చేయాలని అనుకుంటున్నాడట జక్కన్న. ఎన్టీఆర్ కూడా రాజమౌళి దర్శకత్వంలో చేయడానికి సరే కూడా అన్నాడట. ఐతే ఈ భారీ ప్రాజేక్ట్ కి కనిసం మూడేళ్ల పాటు షూటింగ్ ఉంటుందట.

సో ఎన్టీఆర్ జక్కన్నతో సినిమా ఓప్పుకుంటే మూడేళ్లు ఇంకేసినిమా చేయడానికి టైమ్ ఉండదు. ఎన్టీఆర్ మాత్రం జక్కన్నతో సినిమా ఓకే అన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కూడా గత  రెండుమూడేళ్లుగా కేవలం ‘బాహుబలి’ ప్రాజెక్టుకే పరిమితం అయిన సంగతి తెలిసిందే. సో ఎన్టీఆర్ సినిమాకి కూడా భారీ సమయమే పడుతుందంటున్నారు.

ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఏళ్ల తరబడి వెయిట్ చేయడాన్ని తట్టుకోలేము అంటున్నారు. జక్కన్నతో సినిమా చేయడం మాకు ఇష్టమే కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ కాంప్లీట్ చేస్తే బేటర్ అంటున్నారు. ఐతే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‍లో సినిమా ఇంక అధికరికంగా చేప్పలేదు. ఒక వేళ ప్రాజెక్ట్ ఓకే అయితే ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరుగుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -