Monday, May 6, 2024
- Advertisement -

మ‌హేష్ తండ్రి పాత్ర‌కు రజినీకాంత్!

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్‍కి ఏ రెంజ్‍లో పాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు‍కి కూడా మంచి పాలోయింగ్ ఉంది. అయితే మహేష్ బాబుకి తండ్రిగా రజినీకాంత్ నటిస్తే ఎలా ఉంటుంది. అటు కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీ, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ క‌లిసి ఏదైనా మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్నారా..అదే నిజ‌మైతే ఎంత బాగుణ్ణు అని మ‌నందం ఆలోచిస్తాం.

ఈ ఇద్దరి కాంబినేషన్‍లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఇక్కడ అసలు సంగతి ఏంటంటే… బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో మ‌హేష్ తండ్రి పాత్ర‌ను ముందుగా ర‌జ‌నీకాంత్‌తో చేయించాల‌ని అనుకున్నాడ‌ట‌ ఈ సినిమా నిర్మాత పొట్లూరి వరప్రసాద్. రజినీతో పాటు మోహన్ లాల్ పేరు కూడా ఓ దశలో చర్చకు వచ్చిందని కూడా ఆయన వెల్లడించాడు.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పీవీపీ మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి న‌టీనటుల‌ను ఎంపిక చేయ‌డం పెద్ద స‌వాల్‌గా మారింద‌ని, మ‌హేష్ తండ్రి పాత్ర‌కు రజినీకాంత్, మోహన్ లాల్‌ల పేర్లు పరిశీలనకు వచ్చాయి. నాకైతే సత్యరాజ్ అయితేనే బాగుంటుందనిపించింది. ఆయన్నే కన్ఫమ్ చేసిన‌ట్టు పీవీపీ చెప్పారు. ఇక త‌న పీవీపీ బ్యాన‌ర్‌ను విజయా, వాహిని లాంటి సంస్థల స్థాయిలో నిలబెట్టాలన్నది తన లక్ష్యమని పీవీపీ చెప్పాడు. ‘‘ఊపిరి, క్షణం సినిమాలు మా సంస్థకు గౌరవం తెచ్చిపెట్టాయి. మేం ముందు నుంచి కథను నమ్మి సినిమాలు తీశాం. పీవీపీ అంటే మంచి సినిమా అయి ఉంటుందని గర్వంగా చెప్పుకునే సినిమాలే తీయ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -