Tuesday, April 30, 2024
- Advertisement -

ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది!

- Advertisement -

ఆమని..ఇండస్ట్రీలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన హీరోయిన్‌. మావి చిగురు, శుభలగ్నం, జంబలకిడి పంబ వంటి సినిమాల్లో తనదైన శైలీలో నటించి మెప్పించారు. ఇక రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడపదడప తల్లి పాత్రలు చేస్తూ మెప్పిస్తోంది ఆమని.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన కెరీర్‌లో అందరు హీరోలతో కలిసి నటించా కానీ ఒక్క మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రాలేదని తెలిపింది. చిరంజీవి అంటే తనకు పిచ్చి అని… రొమాన్స్ సాంగ్ ఏదైనా డ్రీమ్‌లో ఆలోచిస్తే అక్కడ చిరంజీవే ఉంటారు అని నవ్వుతూ తెలిపింది. తన డ్రీమ్‌లో హీరోయిన్‌ను తీసేసి అక్కడ నేను చేస్తే ఎలా ఉండేది అని వెళ్లిపోయేదాన్ని చెప్పుకొచ్చింది.

రిక్షావోడు సినిమాకు తొలుత తనను సంప్రదిస్తే ఒకే చెప్పాను కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నగ్మాను హీరోయిన్‌గా తీసుకున్నారని ఓ పత్రికలో చూశానని తెలిపారు ఆమని. దీంతో చిరుతో సినిమా మిస్ అయ్యానని ఏడ్చానని తెలిపారు ఆమని. ఆ తర్వాత స్టాలిన్ సినిమాకు ఛాన్స్ రాగా చిరుకు సిస్టర్‌గా చేయనని తెలిపానన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -