Sunday, May 19, 2024
- Advertisement -

రజనీ వర్సెస్ మహేష్

- Advertisement -

వాళ్లిద్దరు పెద్ద హీరోలు. అంతే కాదు సూపర్ స్టార్లు. దశాబ్దల తరబడి సినీ పరిశ్రమలో తన కంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుని దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. తెలుగులోనే కాదు దక్షిణాది బాషల్లోనే టాప్ హీరో అనిపించుకున్న నటుడు మహేష్ బాబు.

వీరిద్దరూ నటించిన చిత్రాలు ఒకేసారి అటు తమిళంలోనూ… ఇటు తెలుగులోనూ కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ఒకే సమయంలో విడుదల కానుండడంతో వీరి సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఒకరు టాలీవుడ్ ని షేక్ చేస్తున్న హీరో అయితే.. మరొకరు అ వుడ్.. ఈ వుడ్ అని తేడా లేకుండా అని వుడ్ లు నావే అంటున్న సూపర్ స్టార్. 

ఇంతకీ ఈ ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్న సినిమాలు ఏమిటో తెలుసా.. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న బ్రహ్మోత్సవం. ఈ చిత్రం ఫ్యామిలి ఎంటర్ టైనర్ కావడంతో తమిళంలో కూడా తీసారు. దీన్ని మే నెల చివరి వారంలో అక్కడ.. ఇక్కడా కూడా విడుదల చేయనున్నారు.

దేశానికే  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం కూడా మే నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మధ్య మంచి హిట్ లేక అభిమానులను నిరాశ పరుస్తున్న రజనీకాంత్ ఈ చిత్రం విజయం సాధిస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు. 

ఒకే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ఇద్దరు హీరోల చిత్రాల్లో ఏది వెండితెరపై వెలిగిపోతుందో తెలియాలంటే రెండంటే రెండే నెలలు ఆగాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -