Wednesday, May 15, 2024
- Advertisement -

మహిళలంటే చులకనా…. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై, డిప్యూటీ స్పీకర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న అత్యాచారాలపై చర్చించరా అంటూ నిలదీసారు. బుధవారం నాడు తెలంగాణ శాసనసభలో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన తెలిపారు.

వాయిదా తీర్మానాలపై చర్చించకుండా టీ బ్రేక్ ఇస్తారా అంటూ మండిపడ్డారు. తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, వాటిపై చర్చించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డి.కె.అరుణ, పద్మావతి పట్టుపట్టారు. దీనిపై చర్చను పెట్టకుండా సభను వాయిదా వేయడం మహిళలను అవమానపరచడమేనని మీడియా పాయింట్ దగ్గర వారు విరుచుకుపడ్డారు.

మహిళలు భద్రతపై షీ టీములు, సిసి  కెమెరాలు, షీ క్యాబులు పెట్టామంటూ గొప్పలు చెప్పడమే తప్ప చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్  జిల్లాలో ఇద్దరు గురుకుల బాలికలు అదృశ్యమైతే దానిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. స్థానిక పోలీసులు ఈ కేసుపై సరిగా వ్యవహరించడం లేదని వాపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -