Friday, May 3, 2024
- Advertisement -

ఆ ఇద్దరి కల అదేనట!

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్.. నందిత. ఇద్దరూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్లే. హిట్టూ ఫ్లాపూ సంబంధం లేకుండా టాప్ హీరోలతో వరుసగా రకుల్ సినిమాలు చేస్తుంటే.. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న స్మాల్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ నందిత టాలెంట్ చూపిస్తోంది.

ఎవరి రూట్ లో వారు బిజీగా ఉన్న ఈ ఇద్దరికీ… తీరని కల ఒకటుందట.ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ని అడిగినా.. మహేష్ బాబుతో నటించాలని ఉంది.. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని చెబుతూ ఉండడం కామన్. అవకాశం కోసమో.. అభిమానంతోనో… కనీసం పబ్లిసిటీ కోసమో. కారణమేదైనా మహేష్ పేరు చెబితే.. తమ పేరు మీడియాలో ఉండడం ఖాయం కాబట్టి.. కొత్త హీరోయిన్లంతా మహేష్ జపం చేస్తున్నారు.

ఇప్పుడు.. రకుల్, నందిత కూడా ఈ కేటిగిరీనే అని నిరూపించుకున్నారు. బ్రూస్ లీ ఓటమితో డీలా పడినా… మంచి సినిమాలు చేతిలో ఉండడంతో దూసుకుపోతున్న రకుల్.. మహేష్ తో నటిస్తే తన కల తీరినట్టే అని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. నందిత కూడా అదే మాట అంటోంది. మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడమే తన టార్గెట్ అని చెబుతోంది. చూడాలి ఈ ఇద్దరిలో ఎవరి కల ముందు తీరుతుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -