Wednesday, May 22, 2024
- Advertisement -

షో మ్యాన్ ను పెళ్లి చేసుకుంటుందట

- Advertisement -

హీరోయిన్లు.. వాళ్ల పెళ్లిళ్లు. ఈ టాపిక్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అది సౌత్ అయినా.. నార్త్ అయినా.. అందాల ముద్దుగుమ్మ అయితే చాలు. వాళ్ల పెళ్లేదో తమ పెళ్లి అన్నట్టు ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తారు. బాలీవుడ్ హాట్ స్టార్ ప్రియాంక చోప్రా విషయంలో కూడా ఇదే జరుగుతోంది.

ఈమె ఎక్కడికి వెళ్లినా.. పెళ్లెపుడు.. లవ్ లో పడ్డారట కదా.. అని మీడియాతో పాటు ఫ్యాన్స్ కూడా అడుతున్నారట. కొన్నాళ్లు లైట్ తీసుకున్న ప్రియాంక.. ఇప్పుడు జవాబు చెప్పక తప్పలేదంటోంది. తాను ఇప్పటివరకు ఎవరితో లవ్ లో పడలేదని.. ఒక వేళ పడితే తప్పకుండా చెబుతాననీ అంటోంది.

అక్కడితో ఆగకుండా.. తనకు షో మ్యాన్ క్వాలిటీస్ ఉన్న మిస్టర్ పర్ ఫెక్ట్ దొరికితే.. వెంటనే పెళ్లి చేసేసుకుంటానని చెప్పింది. మీడియా ముందు భయపడొద్దట.. చాలా ఉత్సాహంగా ఉండాలట. ఇంకా.. అందరిలో చాలా స్పెషల్ గా కూడా ఉండాలని కూడా ప్రియాంక చెబుతోంది.

ఇప్పటి వరకూ బానే ఉంది కానీ.. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికేదెప్పుడో.. ప్రియాంక పెళ్లి పీటలు ఎక్కేదెప్పుడో అంటూ సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -