Tuesday, May 21, 2024
- Advertisement -

చరణ్ పై ఓ కొత్త ప్రచారమం..

- Advertisement -

కొత్త సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్.. రీసెంట్ గా హైదరాబాద్ తిరిగొచ్చాడట. ఓ సినీ స్టార్ కు ఇది మామూలు విషయమే. కానీ.. కశ్మీర్ లో షూటింగ్ పూర్తి చేసుకుని.. హైదరాబాద్ వచ్చే లోపు చరణ్ పై జరుగుతున్న ఓ కొత్త ప్రచారమే.. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇదంతా నిజమేనా అని అంతా అనుకునేలా చేస్తోంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మగధీరుడు రామ్ చరణ్ కు.. విదేశాల్లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉందట. జపాన్, అరబీస్, ఈస్ట్ ఏషియన్.. ఇలా చాలా దేశాల్లో మన చెర్రీకి మంచి ఫ్యాన్ సర్కిల్ ఉందట. మనోడి సినిమా వస్తోందంటే.. అక్కడ కూడా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారట. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇది తెలిసిన కొందరు న్యూట్రల్ సినీ ఫ్యాన్స్ మాత్రం చెర్రీకి కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఇలాంటి ప్రచారం తను చేసుకున్నా.. ఎవరు చేసినా.. ఎవరితో చేయించినా.. తోటి ఫ్యాన్స్ తో నవ్వులపాలు కాక తప్పదని చెర్రీకి చెబుతున్నారు. ముందు.. తోటి ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ పెంచుకున్నట్టే.. పక్క రాష్ట్రాల్లో తన సినిమాలకు డిమాండ్ పెంచుకోవడంతో పాటు.. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు మరిన్ని అందిస్తేనే.. వేరే దేశాల్లో కూడా.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్టు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయం.. చెర్రీ చెవిన పడిందో లేదో మరి!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -