Friday, May 17, 2024
- Advertisement -

చరణ్ కొత్త లుక్ అందుకోసమేనా?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమా కోసం మీసం పెచ్చాడు అంటు సోషల్ మీడియాలో చిరు పోటోస్ తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫోటోస్ చూసి మెగా అభిమానులు మా అభిమాన హీరో కొత్త లుక్‍లో అద్భుతంగా ఉన్నాడు అని తెగ అనంద పడిపోతున్నారు.

మరి ఈ మీసం కట్టు సినిమా కోసమో కాదో తెలియదు కాని అభిమానులు మాత్రం సినిమా కోసమే అనుకుంటున్నారు. ఇప్పుడు అందరు హీరోలు సినిమాపై హైప్ తెచ్చేందుకు కొత్త కొత్త గెటప్స్ న్యూ లుక్స్ ట్రై చేస్తున్నారు. తాజాగా సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలో అందరు హీరోలు కొత్త లుక్‍నే ట్రై చేసారు.

తాజాగా రామ్ చరణ్ కూడా తన కొత్త సినిమా కోసం న్యూ లుక్ ట్రై చేయబొతున్నాడని సీనీ పరిశ్రమలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో చెర్రి ఫోటో తెగ హల్ చల్ చేస్తుంది.ఆ ఫోటోలో చెర్రి ఫ్రెంచ్ కట్ లో కనిపిస్తున్నాడు. తమీళంలో సూపర్ హిట్ అయిన ‘తనీ ఒరువన్’ రీమేక్ లో నటించబోతున్నాడు చరణ్.

ఐతే ఈ సినిమాలో హీరోది పోలీస్ పాత్ర కాబట్టి చెర్రి ఈ న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి నటించబోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -