Saturday, May 18, 2024
- Advertisement -

సోగ్గాడు నాన్నకు ప్రేమతోనే తలదన్నాడు

- Advertisement -

సంక్రాంతి బరిలో వచ్చిన నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు ఇప్పుడు కలక్షన్లు కురిపిస్తున్నాయి. నాన్నకు ప్రేమతో సినిమా యూస్ లో గట్టిగా ఉంది. ఈ సినిమాకి అక్కడ మంచి కలక్షన్స్ వస్తున్నాయి. ఇక నాగర్జున సోగ్గాడే నెమ్మదిగా తన సత్తా చూపిస్తున్నాడు.

ఇప్పుడు నాగర్జున, ఎన్టీఆర్ పోటి పడుతున్నారు కలక్షన్ల విషయంలో. భారీ అంచనాల మధ్యలోరిలీజ్ అయిన సోగ్గాడే సినిమా భారి ఓపనింగ్స్ రాబట్టింది. ప్రస్తుతం నాగర్జున సెఫ్ జోన్లో ఉన్నట్లు సమాచారం. నెమ్మదిగా నాన్నకు ప్రేమతో కలక్షన్స్ తగ్గుతున్నాయి. సోగ్గాడే కలక్షన్స్  పెరగడం మొదలు అయింది.

సోగ్గాడే సినిమా ఈ వారంలోపు 25 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. నాన్నకు ప్రేమతో పోలిస్తే సోగ్గాడే సినిమా మార్కెట్ ప్రతి రోజు మెరుగా కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించగా, సోగ్గాడేను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మొత్తానికి నాగర్జున సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి సోగ్గాడు ఇంకెన్ని కలక్షన్స్ రాబడుతాడో చూద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -