Monday, May 20, 2024
- Advertisement -

రామ్ చరణ్ మూడు పాత్రలు

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫాంలో లేడు, ఎవడు సూపర్ హిట్ తరువాత గోవిందుడు అందరివాడేలే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు, తరువాత చేసిన బ్రూస్ లీ ఆల్ టైం డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. దాంతో ఇప్పుడు ఆశలన్నీ తను చేయబోతున్న తమిళ్ బ్లాక్ బస్టర్ తనీఒరువన్ తెలుగు రీమేక్ ధృవ పైనే పెట్టుకున్నాడు, ఈ సినిమా ఈ దసరాకి రిలీజ్ కాబోతుంది.

కాగా ఈ సినిమా తరువాత టాలీవుడ్ మోస్ట్ ఇంటలీజెంట్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో ఓ సైంటిఫిక్ మూవీ చేయబోతున్నాడు. నాన్నకుప్రేమతో హిట్ తరువాత సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉ౦డగా ఇందులో రామ్ చరణ్ ట్రిబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని ప్రస్తుతం ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

సుకుమార్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్న ఈ సినిమాతో సుకుమార్ కూడా ఈ మధ్యన వచ్చిన సూర్య 24 సినిమాలాగే చాలా కొత్తగా ఉండేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అందులో రామ్ చరణ్ మూడు రకాల రోల్స్ తో అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -