Monday, May 13, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఛాన్స్ వదులుకోడు

- Advertisement -

హీరోగా ఇప్పటివరకు 25 సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అందులో వరుసగా హిట్స్ తో జోరు చూపించింది మాత్రం తక్కువే అని చెప్పాలి, రాఖీ-యమదొంగ లాంటి హిట్స్ తరువాత కంత్రితో ఫ్లాఫ్ కొట్టిన ఎన్టీఆర్ తరువాత బృందావనం-అదుర్స్ లాంటి సూపర్ హిట్స్ తరువాత శక్తితో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ ని సొంతం చేసుకున్నాడు.

దాంతో కెరీర్ లో ఇప్పటివరకు హాట్రిక్ హిట్స్ కొట్టలేదనే భాదఉంది ఎన్టీఆర్ లో. అందుకనే ఈసారి మాత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ కొట్టి తన సత్తా చూపించాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే టెంపర్-నాన్నకుప్రేమతో సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న జనతాగ్యారేజ్ తో హాట్రిక్ కొడతానని అంటున్నాడు.

ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆగస్టు 12 న రిలీజ్ అవ్వబోతుంది, అంతకన్నా ముందు రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఆ లుక్ తోనే ఎన్టీఆర్ హాట్రిక్ కొడతాడన్న నమ్మకం కలిగేలా లుక్ అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. మరి ఎన్టీఆర్ కి హాట్రిక్ దక్కుతుందా లేదా అనేది ఆగస్టు 12 నే తేలుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -