Friday, May 9, 2025
- Advertisement -

ఫేస్ బుక్ లో తల్లితో దిగిన ఫోటో ఫోస్ట్ చేసిన వర్మ..

- Advertisement -

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపల్ వర్మ.. ట్విట్టర్ లో ఉన్నప్పుడు.. ఏదో ఒక ట్విట్ చేసి.. సంచలనం సృష్టించేవాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మీద ఆయన ఫోకస్ ఎక్కువగా ఉండేది. ఇక వర్మకి ట్విట్ చేసి చేసి విసుగు వచ్చిందేమో.. ఇక ట్విట్టర్ నుంచి బయటకు వచ్చి ఫేస్ బుక్ మీద పడిపోయాడు.

ఇటివలే అర్జున్ రెడ్డి సినిమాని ఆకాశానికి ఎత్తిన వర్మ.. పవన్ కళ్యాణ్ కంటే.. అద్భుతంగా విజయ్ దేవరకొండ నటించాడని.. తెలంగాణ పవర్ స్టార్ విజయ్ అని తెగ పొగిడేశాడు. సినిమాకి కావాల్సినంత పబ్లిసిటిని వర్మ తెచ్చిపెట్టాడు. వర్మ ఎప్పుడు ఏదో ఒక వివదాంతో సాహసం చేస్తుంటాడు. తాజాగా తన తల్లి ఫోటోతో ఓ పోస్టు చేశాడు. వర్మ చేసిన ఈ పోస్టుకు మంచి స్పందన వస్తుంది. వందలాదిగా వర్మ అభిమానులు స్పందిస్తున్నారు. వేలల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ పోస్టు ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంది. వర్మ టీనేజీ వయసులో ఉన్నపుడు తన తల్లితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశారు.

అమ్మ ఎంతో బ్యూటిఫుల్ అంటూ.. పక్కనే ఉన్న కుర్రాడి గురించి జోకర్ అంటూ కామెంట్ చేశారు. ఆ జోజర్ తానే అంటూ వర్మ పేర్కొనడం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ మీద బయట జనాల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొడకు ఎలాంటి వాడైనా అమ్మ దృష్టిలో అభిప్రాయం ఒకటే ఉంటుంది. ఆ మధ్య వర్మ గురించి ఆయన తల్లి సూర్యావతి.. మాట్లాడుతూ.. తన కొడుకు చాలా గొప్ప వ్యక్తి అని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -