Wednesday, April 24, 2024
- Advertisement -

వాళ్ల రూంలోకి వెళ్తే ఛాన్సులు.. హీరోయిన్ కామెంట్స్

- Advertisement -

సుచీ లీక్స్ ఏ టైంలో స్టార్ట్ అయిందో కానీ సినీ పరిశ్రమ వెనకలో జరుగుతున్న చీకటి కోణాలపై ఇప్పుడు అందరు సీక్రెట్స్ బయటపెడుతున్నారు. ఇలాంటి విషయాలపై ఇప్పటివరకు మాట్లాడని హీరోయిన్స్ కూడా నోరు విప్పుతున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ లో ఇలాంటి పరిస్థితులు ఎదురుకున్నాం అని ఒక్కొక్కరు ఒప్పుకుంటున్నారు. తమకూ ఇలాంటి సంఘటనలు ఎదురు అయ్యాయని పలు ఇంటర్వ్యూలో చెపుతున్నారు.

అయితే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడే సదరు దర్శకులు నిర్మాతల పేర్లు బయట పెట్టె సాహసం మాత్రం ఎవరూ కూడా చేయడం లేదు. తాజాగా రమ్యకృష్ణ మరోసారి ఇలాంటి పరిస్థితులపై నోరు విప్పారు. సినీ పరిశ్రమలో అడ్జస్ట్మెంట్ అనేది తప్పదని.. చెప్పింది. అలానే ఇండస్ట్రీ లో వేధింపుల గురించి నటి రెజీనా, ఒక ఛానల్ ప్రతినిధి మల్లి ఎప్పుడు కలుద్దాం అని అన్నరంటూ నటి వరలక్ష్మి శరత్ కుమార్, తానూ ఇలాంటి వేధింపులను ఎడుర్కున్నానంటూ నటి సంధ్య , తాప్సీ పన్ను లాంటి హీరోయిన్ మాత్రమె కాదు రాధిక ఆప్టే , సుకన్య లాంటి తారలు చెప్పారు. ఇలా పలువురు హీరోయిన్లు తమకు జరిగిన చేదు అనుభవాలను బహిరంగంగానే చెప్పడం సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.

నిర్మాతల, దర్శకుల రూమ్ లకు వెళ్లితేనే సినిమా ఛాన్సులు వస్తాయని.. చాలా మంది చెప్పారు. అలా లొంగకపోతే సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పడటం ఖాయం అని అన్నారు. అలాంటి వేధింపులు చాలా మంది ఎదుర్కున్నారని కొంతమంది హీరోయిన్లు అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా సినిమా పరిశ్రమలో చీకటి కొణాలపై సీనియర్ నటి రమ్యకృష్ణ ఫస్ట్ టైం స్పందించడం సినీ పరిశ్రమలో రచ్చ లేపింది. ఈ వ్యవహారంపై తన స్పందనను బోల్డ్ గా చెప్పిన రమ్యకృష్ణ ఇతర రంగాల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీ లో అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అని చెప్పింది.

అంతేకాకుండా అలా ఆడ్జస్ట్ అవుతానే.. పరిశ్రమలో ముందుకు వెళ్తారని.. లేకుంటే కష్టం అని తెలిపింది. ఇక పోతే అడ్జస్ట్ అవ్వడం..కాకపోవడం వారి వ్యక్తిగత నిర్ణయాలపై అదరపడి ఉంటుందని.. తెలిపింది. సినిమాలో స్టార్ హీరోయిన్ గా ఎదగడం కోసం.. చాలా మంది చాలా సార్లు అడ్జస్ట్ అవుతున్నారని తెలిపింది.

https://www.youtube.com/watch?v=qJ4W_P-NKDg

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -