Sunday, May 19, 2024
- Advertisement -

పాక్‌కు నిధులు ఇవ్వ‌మ‌ని తేల్చి చెప్పిన పెంట‌గాన్‌…

- Advertisement -

ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోన్న పాకిస్థాన్‌కు అమెరికా నుంచి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది.ఇప్ప‌టికే అంతర్జాతీయ ఉగ్ర‌వాద జాబితాలో చేర్చిన పెద్ద‌న్న ఇప్పుడు మ‌రో పెద్ద షాక్ ఇచ్చింది.పాకిస్థాన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని అమెరికా మిలిటరీ సంస్థ పెంటగాన్‌ స్పష్టం చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో పాక్‌ విఫలమైనందున ఇక మిలిటరీ రియంబర్స్‌మెంట్‌కింద 2016 సంవత్సరానికి ఎలాంటి చెల్లింపులు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్‌ మాట్టిస్‌ తెలిపారు.

పాక్‌లోని అతిపెద్ద ఉగ్రవాద సంస్థ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ను కట్టడి చేయడంలో పాకిస్థాన్‌ విఫలమైందని అమెరికా అధికారులు చెప్పారు. ‘పాకిస్థాన్‌ ప్రభుత్వానికి మేం 2016కుగానూ నిధులు మంజూరు చేయలేమ‌ని తేల్చి చెప్పింది.ఇక పాక్ ప‌రిస్థితి అద్వాన్నంగా మార‌నుంది.

హక్కానీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా పాక్‌ వ్యవహరించినట్లుగానీ, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకున్నట్లుగానీ పాక్‌కు సెక్రటరీగా వ్యవహరిస్తున్న మా దేశ ప్రతినిధి జిమ్‌ మాట్టిస్‌ ధ్రువీకరించనందున ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని పెంటగాన్‌ అధికారిక ప్రతినిధి ఆడం స్టంప్ వెల్ల‌డించారు.ఇక అంత‌ర్జాతీయంగా పాక్ వ‌చ్చే నిధులు ఆగిపోతాయి.ఇదే జ‌రిగితె పాక్ ఏకాకిగా మార‌నుంది.ఆర్థిక ప‌రిస్థితుల్లో కూరుకుపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -