Saturday, May 4, 2024
- Advertisement -

వెంకీ త‌ర్వాత రానాతో వ‌రుణ్ మ‌ల్టీస్టార‌ర్‌

- Advertisement -

ఫిదా సినిమా విజ‌యంతో జోష్ మీద ఉన్న న‌టుడు వ‌రుణ్‌తేజ్. వెంకీ అట్లూరి దర్శకత్వం, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మాణం తీస్తున్న ‘తొలిప్రేమ’ సినిమాలో న‌టిస్తుండ‌గా మ‌రి రెండింటి సినిమాల‌ను ఒకే చేశాడు. అయితే ఆ రెండు సినిమాలూ మ‌ల్టీస్టార‌ర్‌. అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు‌, నటిస్తున్న వరుణ్‌తేజ్‌ మల్టీస్టారర్ సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపారు.

ఇప్పుడు వరుణ్‌ తాజాగా రానాతో కలిసి మరో మల్టీస్టారర్‌లో నటించడానికి అంగీకరించాడట. ప్రముఖ తమిళ డైరెక్టర్‌ సాల్మన్‌ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంద‌ని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు కొన‌సాగుతున్నాయి. త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ని సమాచారం.ప్రస్తుతం రానా ‘1945’ లో నటిస్తున్నాడు. తరువాత ‘హతి మేరే సాతి’ ను రీమేక్‌గా ‘బాందేవ్’ సినిమాలో నటిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=qur0PXYrHYU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -