Monday, April 29, 2024
- Advertisement -

రానా నాయుడు..ఒకే ఒక వెబ్ సిరీస్!

- Advertisement -

కరోనా, లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్‌లు సత్తా చాటుతుండటంతో యువ దర్శకులు అంతా వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించారు. ఇక అగ్రహీరోలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తుండగా హీరోయిన్స్ సంగతి చెప్పనక్కర్లేదు. వెబ్ సిరీస్‌ కోసం ఎందతకైనా రెడీ అంటూ రెచ్చిపోయి మరి నటిస్తున్నారు. అలా వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు.

పూర్తి బోల్డ్,వినడానికి కూడా కష్టంగా ఉండే బూతులతో వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో సత్తా చాటుతోంది. అయితే తెలుగు వెర్షన్‌ను నెట్ ఫ్లిక్స్ తొలగించిన వివిధ భాషల్లో వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ కావడంతో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు స్ట్రీమింగ్ చేసిన ప్రపంచవ్యాప్త టాప్ 400 వెబ్ కంటెంట్‌లలో రానా నాయుడు మాత్రమే చోటు దక్కించుకుంది.

ఇక ఇటీవలె సెకండ్ సీజన్‌ని స్టార్ట్ చేయగా ఫస్టా ఫ్‌లో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేలా సెకండ్ సీజన్‌ను తెరకెక్కిస్తున్నారు. రానా నాయుడు 2 ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. రానా నాయుడు గ్లోబల్ టాప్ 10 సిరీస్ లిస్ట్‌లో స్థానం కూడా సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -