దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఏ రెంజ్‍లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయి రికార్డులు సృష్టించడంతో పాటు ఈ సినిమాలో నటించిన నటి నటులుకు మంచి పేరు తెచ్చిపేట్టింది. తెలుగులోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇప్పుడు బాహుబలి 2 కోసం ఎదురు చూస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న సమాచారం కనిపించినా.. వినిపించినా.. చాలా ఆసక్తిగా చూస్తున్నారు జనాలు. ఇలాంటి తరుణంలో తాను పోషిస్తున్న భల్లాలదేవుడి పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు రానా. భల్లాలదేవుడి పాత్ర తొలి భాగంలో కంటే రెండో భాగంలో చాలా క్రూరంగా ఉంటుందని అతను వెల్లడించారు. జనాలు మరింతగా ఈ పాత్రను అసహ్యించుకుంటారని.. తనను చూసి అమ్మాయిలందరూ మరింతగా భయపడతారని రానా చెప్పాడు.
భల్లాలదేవుడికి భార్యగా నటించే హీరోయిన్ విషయంలో సాగుతున్న ఊహాగానాల గురించి రానా మాట్లాడుతూ.. ”భల్లాలదేవుడు రొమాన్స్ చేసేది అమ్మాయిలతో కాదు.. సింహాసనంతో. బాహుబలి-2లో కొత్త పాత్రలేవైనా ఉంటే వాటిని కచ్చితంగా వెల్లడిస్తాం. దాచాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి వెయిట్ చేయండి” అన్నాడు. నేను ఇంక బహుబలి షూటింగ్‍లో పాల్గొనలేదని త్వరలోనే షూటింగ్‍లో పాల్గొంటాను అని తెలిపాడు.
