Monday, April 29, 2024
- Advertisement -

సూర్య-ఎన్టీఆర్ లతో రాజమౌళి చిత్రం?

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే బాహుబలి తో సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 షూటింగ్‍లో బిజీగా ఉండగా. ఈ సినిమా తర్వాత మరో సంచలనానికి రెడీ అవుతున్నట్లు సినీ పరిశ్రమ లో పూకార్లు వినిపిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం 1, సింహాద్రి , యమదొంగ చిత్రాలు తీసాడు రాజమౌళి.

ఈ మూడూ సినిమాలు అద్భుతమైన విజయం సొంతం చేసుకోగా ఇటు ఎన్టీఆర్ కెరీర్ అగ్ర పథాన దూసుకుపోగా ,అటు రాజమౌళి కూడా దర్శకుడిగా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ -రాజమౌళి ల కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . వారి ఆశలు నెరవేరే చాన్స్ ఉందని వినబడుతోంది.

త్వరలోనే ఎన్టీఆర్ -సూర్య ల కాంబినేషన్ లో రాజమౌళి ద్విభాషా చిత్రానికి శ్రీకారం చుట్టనున్నాడు అని వార్తలు వస్తున్నాయి . ఇక సూర్య విషయానికి వస్తే రాజమౌళి చిత్రంలో చిన్న పాత్ర లభించినా చేయడానికి రెడీ అని గతంలోనే సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే.  ఒకవేళ ఈ ముగ్గురి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉండగా, సూర్య 24 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -