Friday, April 19, 2024
- Advertisement -

ఎవరో తెలీదు కానీ కిస్సు పెట్టేసాడు

- Advertisement -

ఒక్క సినిమాతో బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన చోటు దక్కించుకున్నాడు కుర్ర హీరో రణవీర్ సింగ్. లాస్ట్ ఇయర్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ మూవీ దిల్ వాలేకి పోటిగా రిలీజ్ చేసిన రణవీర్ భాజీరావ్ మస్తానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు తన కొత్త సినిమా షూట్ లో ఉన్న రణవీర్ ఓ గుర్తుతెలియని అమ్మాయిని ముద్దు పెట్టుకుంటూ ఫోటోకి చిక్కాడు.

దీపిక పడుకొన్ ముద్దుల లవర్ రణవీర్ సింగ్ ప్రస్తుతం తన కొత్త సినిమా బేఫికర్ సినిమా షూటింగ్ లో భాగంగా లండన్ లో బిజీగా ఉన్నాడు. మరోపక్క తన ప్రియమైన ప్రేయసి దీపిక పడుకొన్ తన మొదటి హాలీవుడ్ సినిమా xXx సినిమా సీక్వెల్ షూటింగ్ నిమిత్తం హాలీవుడ్ లో షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉంది.

ఇద్దరు ఒక్క చోట ఉండే సమస్యే లేదు కాబట్టి ఇక్కడ రణవీర్ ముద్దు పెడుతున్న అమ్మాయి దీపిక మాత్రం కాదు. దాంతో ప్రస్తుతం ఈ గుర్తు తెలియని అమ్మాయి ఎవరై ఉంటుందని బాలీవుడ్ మొత్తం ఆరాలు తీయడం మొదలుపెట్టింది. ఎలాగు తన కొత్త సినిమా బేఫికర్ లో చాలా ముద్దు సీన్లు ఉండటంతో హీరోయిన్ తోనే ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అని కూడా అనుకుంటున్నారు. మరి ఈమె హీరోయిన్ వాణీకాపూరా లేక వేరే అమ్మాయా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -