Sunday, May 19, 2024
- Advertisement -

రజినీకాంత్ సినిమా హక్కుల సొమ్ము తెలిస్తే మైండ్ పోతుంది

- Advertisement -

సూపర్ స్టార్ రజిని సినిమా హిట్ అయితే కాసుల వర్షం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే రజిని సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమాను తమ సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం రజిని చేస్తున్న సినిమా కబాలి. ఇప్పటికే టీజర్ తో దుమ్మురేపుతున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీ రేంజ్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక సినిమా డిమాండ్ ను బట్టే రేటు కాబట్టి ఈ సినిమాను తెలుగులో దాదాపు 30 కోట్లకు డీల్ కుదుర్చుకుంటున్నారట అభిషేక్ పిక్చర్స్. కేవలం తెలుగులో రిలీజ్ కే ఇంత భారీ మొత్తం అంటే ఒక్కసారిగా అందరు షాక్ అవుతున్నారు. అదీగాక రెండు వరుస ఫ్లాపుల్లో ఉన్న రజినికాంత్ సినిమాకు ఈ విధమైన డిమాండ్ అంటే కష్టమే.

అయితే అభిషేక్ వారు అయినా రిస్క్ చేస్తున్నారని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రిలీజ్ కు 31 కోట్లకు ఫిక్స్ చేశారట. రజిని సినిమా హిట్ అయితే ఇదో పెద్ద లెక్కేం కాదు కాని సినిమా తేడా కొడితే మాత్రం అసలకే మోసం వచ్చే పరిస్థితి వస్తుంది. మరి అభిషేక్ పిక్చర్స్ తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -