Wednesday, May 15, 2024
- Advertisement -

రేష్మి రెచ్చిపోతుంది!

- Advertisement -

జబర్దస్త్ పోగ్రామ్ రేష్మి చాలా ఫేమస్ అయింది. అలా ఫేమస్ అయిన రేష్మి జబర్దస్త్  చేయకముందు అడపదడప సినిమాలు చేసిన అవి పెద్దగా పేరు తెచ్చి పెట్టాలేదు. కానీ జబర్దస్త్ పోగ్రామ్ తర్వాత రేష్మి జాతకమే మారిపోయింది. ‘చందమామ కథలు’ చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు టాకీసు’ చిత్రంలో రేష్మి హీరోయిన్‍గా నటిస్తుంది.

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రల్లో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ఎం.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాకి సంబంధించి సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్‍లో ఎప్పుడూ లేనంత హాట్‍గా కనిపిస్తుంది రేష్మి. ఈ సినిమా  స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది.

అలాగే రేష్మి మాట్లాడుతూ టీవి యాంకర్‌గా చేస్తున్న తనకు ఈ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ తెలిపింది. మరి హీరోయిన్‍గా వస్తున్న రేష్మికి ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి.

{youtube}v=D9-JMan1Rp0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -