రష్మీ.. బుల్లితెర ద్వారా ఎంతో మందికి దగ్గరైన యాంకర్. ఈ అమ్మడును యాంకర్ రష్మీ అనేకంటే సుధీర్-రష్మీ అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారేమో.. అవును వాళ్లిద్దరూ పండించే కామెడీ అలాంటిది మరీ. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ పలు సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు బుల్లి తెరకే పరిమితం అయిన ఈ అమ్మడుకి ఇప్పుడు ఒక మంచి ఆఫర్ కొట్టేసిందట.
ఆ ఆఫర్ కూడా చిన్నా చితకది కాదు. పవర్ స్ఠార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం. అవును పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం వకీల్ సాబ్ లో ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందట. అందులో యాంకర్ రష్మీ యాక్ట్ చేస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. శృతి హాసన్ ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై ఎన్నో అంచనాలను పెంచింది. ఇప్పుడు యాంకర్ రష్మీతో స్పెషల్ సాంగ్ అనే అప్‌డేట్ అందరిని ఎంతో ఉత్సహపరుస్తుంది. చూడాలి ఇది ఎంతవరకు నిజమో..!
మరోసారి గోపిచంద్ తో రాశిఖన్నా రోమాన్స్ !
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాగచైతన్య!
చైనాలో పిల్లలు పుట్టట్లే.. ! ఆందోళనలో ఆ దేశం.. అందుకేనా?