Friday, April 26, 2024
- Advertisement -

రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుందా..?

- Advertisement -

యాంకర్ రష్మి గౌతమ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. జబర్దస్త్ తో ఆమె రేంజ్ చాలా మారింది. జబర్దస్త్ తో పాటు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ చేస్తూ చాలా బిజీ బిజీ గా ఉంటోంది. అడపాదడపా మరికొ్ని ప్రైవేట్ ప్రోగ్రాంలు కూడా చేస్తూ బిజీగా మారింది. గతంలో పలు సినిమాల్లోనూ హీరోయన్ గా నటించింది. అవి ఆశించినంతగా పేరు తీసుకురాలేదు.

ఈ మధ్య ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సైతం యాంకర్ గా చేసింది. ప్రముఖ యాంకర్ సుమ అవకాశాన్ని కొల్లగొట్టి మరీ రష్మి ఈ అవకాశాన్ని చేజిక్కించుకుందని అప్పట్టో టాక్ నడిచింది. జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ సుధీర్ రష్మిలు చానాళ్లుగా ప్రేమలో ఉన్నారని టాక్. వీరి పెయిర్ కి చాలా క్రేజ్ ఉంది. వీరిద్దురు పెళ్లి కూడా చేసుకోనున్నారని పుకార్లు కూడా వచ్చాయి.

కాగా రష్మి ప్రస్తుతం హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుందని టాక్ నడుస్తోంది. అతను ఒక కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడని సమాచారం. చాలాకాలం నుంచే వీరికి పరిచయం ఉందని, అత్యంత సన్నిహితు సమక్షంలో వీరు సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందని, నగరంలోనే వీరిద్దరు కలిసి ఉంటున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా వీటిపై రష్మి ఇప్పటి వరకు స్పందించలేదు. సోషల్ మీడియాలో ఇటువంటి కథనాలు ఎన్నివస్తున్నా రష్మి స్పందిచడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతుంది.

Also Read: పెళ్ళికి సిద్దమైన సుడిగాలి సుధీర్.. అమ్మాయి ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -