Monday, April 29, 2024
- Advertisement -

లిప్ లాక్‌కే రూ.20 లక్షలు తీసుకుందట!

- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – 5 భాషల్లో విడుదల కానుంది.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే అర్జున్ రెడ్డితో బాలీవుడ్‌ను షేక్ చేశారు సందీప్. తాజాగా యానిమల్ అంటూ వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ,అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రష్మికా పూర్తిగా మారిపోయింది. తన గత సినిమాల్లో లిప్ లాక్‌లకు దూరంగా ఉండగా ఈ సినిమాలో హద్దులను చెరిపేసి నటించింది. ముఖ్యంగా రణబీర్‌తో లిప్‌లాక్ సీన్లలో రెచ్చిపోయింది. రష్మికా ఇంతలా రొమాన్స్ చేసిందా అనేంతలా నటించింది. రణబీర్‌తో కెమిస్ట్రీ పర్‌ఫెక్ట్‌గా కుదిరినా ఓ వార్త బీ టౌన్‌లో వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో లిప్ లాక్‌ కోసం రూ.20 లక్షలు తీసుకుందట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఒక్కో లిప్ సీన్‌కు ఇంత మొత్తంలో తీసుకుందట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాక విడుదలైన సినిమా వీడియోలను చూస్తుంటే ఇదే విషయం అర్ధంగాక మానదు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ సినిమా రిలీజైతే రష్మికా అభిమానులకు మాత్రం పండగే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -