- Advertisement -

కమ్మ సామాజికవర్గం బాబుకు దూరమవుతోందా?

- Advertisement -

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకొకపోయినా కుల రాజకీయాలకు కేరాఫ్ ఏపీ. కమ్మ,కాపు,రెడ్లు ఇలా సామాజిక వర్గాల ప్రాబల్యమే ఎక్కువ. ఇక ప్రధానంగా టీడీపీకి బలం కార్యకర్తలు ఒక వైపు అయితే మరోవైపు కమ్మ సామాజిక వర్గం మరో బలం. అందుకే టీడీపీ, చంద్రబాబు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆ సామాజిక వర్గం అండగా ఉంది.ఉంటుంది కూడా. ఇది ఎవరు కాదనలేని సత్యం. అందుకే చంద్రబాబు చేసే ప్రతి పనిలో కమ్మదనం స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీ హయాంలో చేపట్టిన అమరావతి నిర్మాణం..దాని చుట్టుపక్కల ఉన్న భూముల్లో మెజార్టీ కమ్మ సామాజిక వర్గానివే. తన సామాజిక వర్గం కోసమే చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టారనే అపవాదు కూడా ఉంది.

అయితే తనకు కులానికి లబ్ది చేయడం వరకు బాగానే ఉన్న ఈ క్రమంలో బాబు తీసుకున్న అవినీతి విధానాలే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి. వివిధ కేసుల్లో ఏ1గా ఉన్నారు ఇక బాబు రిమాండ్‌లో ఉండబట్టి నెల రోజులు దాటింద. ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. ఇక టీడీపీని సరైన దారిలో తీసుకువెళ్లే నేతలెవరూ కనిపించడం లేదు. ఇక సమయంలో జగన్ మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నారు.

టీడీపీ, చంద్రబాబు అవినీతిని ప్రజల మధ్య ఎండగడుతునే మరోవైపు ఈ దసరా నుండి విశాఖపట్నం నుండి పాలన సాగించనున్నారు. ఇందుకు సంబంధించి శరవేగంగా పనులు కూడా పూర్తికావడానికి వచ్చాయి. దీంతో అమరావతి చుట్టూ బాబును నమ్ముకుని భూములు కొన్నవారంతా బయటకు మింగలేక కక్కలేక ఉన్న పరిస్థితి. వాస్తవానికి వైఎస్ హయాంలో అన్ని వర్గాలను దగ్గర తీసుకున్నారు. అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేశారు. ఇక వైఎస్ హయాంలో ఎక్కువగా లబ్ది పొందింది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే. కానీ వైఎస్ మరణం తర్వాత బాబు పంతన చేరిపోయారు.

అందుకే బాబు అరెస్ట్ తర్వాత తొలుత ఎక్కువగా స్పందించింది బాబు సామాజికవర్గమే. అయితే తర్వాత మెల్లమెల్లగా ప్రజల నుండి మద్దతు కరువవుతుండటంతో కమ్మ సామాజిక వర్గం నేతలు కూడా బాబుకు దూరమవుతు వస్తున్నారు. ఇక ప్రతీ శనివారం టీడీపీ పిలుపునిస్తున్న ఆందోళనల్లో సైతం పాల్గొనడం లేదు…ఫలితంగా వీకెండ్స్ లో సౌండ్స్ చేయడం లైట్లు ఆర్పడం, సంకెళ్ళు వేసుకోవడం వంటి కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్‌గానే మిగిలిపోయాయి. బాబుకు దూరమవుతున్న కమ్మ సామాజికవర్గం నేతలు ఇప్పుడు వైసీపీని అక్కున చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా రోజుకో ట్విస్ట్‌తో చంద్రబాబు, టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -