Monday, April 29, 2024
- Advertisement -

యానిమల్..రష్మికా లుక్ అదిరిపోయిందిగా!

- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. ఈ సినిమా అప్‌డేట్ గురించి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా టీజర్‌ని సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రపంచవ్యాప్తంగా 1 డిసెంబర్ 2023న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం – 5 భాషల్లో విడుదల కానుంది.

ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నిన్న అనిల్ కపూర్ లుక్‌ని రివీల్ చేయగా తాజాగా ఇవాళ రష్మికా మందన్న క్యూట్ లుక్‌ని రిలీజ్ చేశారు.చీర కట్టులో చాలా సింపుల్ అండ్ హోమ్లీ లుక్‌లో అదిరిపోయింది రష్మికా.

హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే అర్జున్ రెడ్డితో బాలీవుడ్‌ను షేక్ చేశారు సందీప్. తాజాగా యానిమల్ అంటూ వస్తుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ వంటి స్టార్‌లు నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -