Sunday, April 28, 2024
- Advertisement -

సౌందర్య బయోపిక్..వచ్చేస్తోంది!

- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్‌లు రాగా తాజాగా మరో నటి బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. దివంగత సౌందర్య బయోపిక్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి సౌందర్య బయోపిక్‌ గురించి ఎన్నో రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మికా చేసిన వ్యాఖ్యలతో మరోసారి సౌందర్య బయోపిక్ తెరపైకి వచ్చింది. ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నేను కొంచెం సౌందర్య గారిలా ఉన్నానని అనేవారని గుర్తు చేసింది రష్మికా. అందుకే సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉందని..కలిసి వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది. దీంతో సౌందర్య బయోపిక్ ఎవరు తెరకెక్కిస్తారనే టాక్ ఇప్పుడు టీ టౌన్‌లో నడుస్తోంది.

1990ల్లో ఇండస్ట్రీని ఏలారు సౌందర్య. దాదాపు దశాబ్ద కాలం పాటు అగ్రహీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్రహీరోలందరితో నటించడమే కాదు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు సౌందర్య. ఆమె మరణించి 20 ఏళ్ళు అవుతున్నా ప్రేక్షకులు మాత్రం ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -