Wednesday, May 1, 2024
- Advertisement -

చిరు వల్లే నా కల నెరవేరింది!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి…ఎంతోమందికి స్పూర్తి. చిరుని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది వెండితెరకు పరిచయమయ్యారు. చిరు నటనలోనే కాదు మానవత్వంలోనూ మనసున్న మారాజే. ఇండస్ట్రీలో ఎవరికి ఆపద వచ్చినా మూడో కంటికి తెలియకుండా సాయం అందిస్తారు.

తాజాగా విలన్ సత్య ప్రకాష్…మెగాస్టార్ తనకు చేసిన సాయం గురించి వివరించారు. భారతీయ సినీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు సత్యప్రకాష్. 11 భాషల్లో 500కి పైగా సినిమాల్లో నటించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్య ప్రకాష్…చిరు తనకు చేసిన సాయం గురించి వివరించారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన వల్లే తన జీవితంలో మొట్ట మొదటి కారు కొనుక్కున్నానని తెలిపారు.

బిగ్ బాస్ సినిమా టైమ్‌లో స్కూటర్ మీద షూటింగ్‌కి వచ్చేవాడినని…అది గమనించిన చిరంజీవి ఒకసారి సత్య ప్రకాష్‌ని పిలిచి షూటింగ్‌కి ఎలా వస్తావని అడిగారని తెలిపారు. స్కూటర్ మీద వస్తాను అని చెప్పగానే హెల్మెట్ పెట్టుకుంటావా? అని చిరంజీవి అడిగారని లేదు అని చెప్పగానే స్కూటర్ మీద హెల్మెట్ లేకుండా వెళ్లడం, రావడం చేస్తున్నప్పుడు బై ఛాన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఇండస్ట్రీ మంచి స్టార్‌ని మిస్ అవుతుందని చెప్పాడన్నారు. అంతేగాదు ఫండింగ్ చేస్తాను కారు కొనుక్కో అని చెప్పి సాయం చేయడంతో కారును కొనుక్కున్నానని తెలిపారు సత్యప్రకాష్. అందుకే తన వద్ద ఎన్నికార్లు ఉన్నా మెగాస్టార్ ద్వారా కొనుకున్న ఫస్ట్ కారు మాత్రం ఎంతో ప్రత్యేకమని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -